మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా?
రైతులతో అధికారులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం 6 ఎకరాల 13 గుంటల భూమి అవసరమవుతుందని, ఇంకా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ లక్ష్మీనారాయణ, అధికారులు.. రైతులకు తెలిపారు. బుధవారం సంబంధిత 18 మంది రైతులతో కలిసి వారు పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆమేరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రైల్వే ఏఈ సంజీవ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్‌రావు, చేర్యాల సీఐ శ్రీను, ఆర్‌ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి మూలవిరాట్ దర్శనం నిలిపివేత
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూలవిరాట్ దర్శనం ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ బాలజీ బుధవారం తెలిపారు. స్వామివారి కల్యాణ మహోత్సవం ఈనెల 29న జరగనుందన్నారు. దీంతో స్వామి మూలవిరాట్‌తో పాటు అమ్మవార్ల మూలవిరాట్‌లకు రంగులను అద్దనున్నారన్నారు. దీంతో ఆరోజు నుంచి దర్శనాలు నిలిపేస్తున్నామన్నారు. ఈనెల 29న ఉదయం 6 గంటల నుంచి పునరుద్ధరిస్తామన్నారు.
సంబరాలను
ఘనంగా నిర్వహించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యా సాంస్క ృతిక సంబరాలను ఘనంగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల వనరుల కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించే మండల స్థాయి విద్యా సాంస్క ృతిక సంబరాలకు సంబంధించిన పోస్టర్లను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వెంకటయ్యతో కలిసి ఆయన బుధవారం ఆవిష్కరించారు. భూంపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు విద్యతో పాటు సాంస్క ృతిక రంగంలో రాణించడానికి ఈ సంబరాలు దోహదం కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment