ఆయిల్‌పామ్‌తోనే అధిక లాభాలు
జిల్లా వ్యవసాయ అధికారి రాధిక
మర్కూక్(గజ్వేల్): రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని, అధిక లాభాలు గడించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, జిల్లా పట్టు, ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆయిల్‌పామ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాదీ రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అంతర పంటలను సాగు చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ సౌకర్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. డ్రిప్‌పై ఎస్సీలకు, వందశాతం, బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం కల్పిస్తోందన్నారు. వాణిజ్య పంటలకు అనుకూలంగా లేని భూముల్లో సాగు మంచిదని వివరించారు. అనంతరం మర్కూక్‌లో సాగులో ఉన్న ఆయిల్‌పామ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ అనిల్, ఏఓ వసంతరావు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment