అనుమతులు రద్దు చేయాలి
● వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలివేయాల్సిందే ● కలెక్టరేట్ ఏఓకు సీపీఎం వినతి
సిద్దిపేటరూరల్: బెజ్జంకి మండలం గుగ్గిళ్ల, పోతారం గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ కోరింది. బుధవారం కలెక్టరేట్ ఏఓకు నేతలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్ మాట్లాడారు. జిల్లాలోని బెజ్జంకి మండలం గుగ్గిళ్ల, పోతారం గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ వల్ల చుట్టూ 10 గ్రామాల పరిధిలో భూసారం దెబ్బతిని పంటలు పండక ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కంపెనీ నుంచి వెలువడే విషవాయువుల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రకృతి ధ్వంసమై కాలుష్యం బారిన పడి ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కంపెనీ నిర్మాణం చేపట్టవద్దని ప్రజ లు నిరసనలు తెలియజేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా పనులను కొనసాగిస్తోందన్నా రు. ఇప్పటికై నా ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాలస్వామి, బెజ్జంకి మండల కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment