Ind Vs Aus 3rd Test Indore Day 1: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లలో ఈ మేరకు స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతున్న నేపథ్యంలో రోహిత్ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాతి అత్యధిక స్కోరు శుబ్‌మన్ గిల్(21)ది. దీనిని బట్టి పిచ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో అత్యధికంగా మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు.
రోహిత్ శర్మ(12), శుబ్‌మన్ గిల్(21), శ్రేయస్ అయ్యర్(0), రవిచంద్ర అశ్విన్(3) రూపంలో కీలక వికెట్లు తీయడంతో పాటు.. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఉమేశ్ యాదవ్(13 బంతుల్లో 17) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కుహ్నెమన్.
ఇక నాథన్ లియోన్ ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4), శ్రీకర్ భరత్(17)లను అవుట్ చేశాడు. టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లిని ఎల్బీడబ్ల్యూ చేయగా.. మహ్మద్ సిరాజ్ రనౌట్‌లో ట్రావిస్ హెడ్, లియోన్ భాగమయ్యారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా బుధవారం (మార్చి 1) టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలైన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.
చదవండి: Ind Vs Aus 3rd Test: ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో..
Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం
Comments
Please login to add a commentAdd a comment