Photo Courtesy: RCB Twitter
అహ్మదాబాద్: ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆడబోయే ఒక మ్యాచ్‌లో బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా బ్లూ జెర్సీలో బరిలోకి దిగనున్నట్లు ఆదివారం ఆర్‌సీబీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీడియోను పోస్ట్ చేసింది.
'బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్సిజన్ కొరత, వైద్య పరికరాల అవసరం ఉందో అక్కడ ఆర్‌సీబీ సాయం అందించనుంది. ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో భాగంగా ఓ మ్యాచ్‌లో ప్రత్యేక జెర్సీ ధరించనున్నాం. గతేడాది కరోనా నియంత్రణలో భాగంగా ముందుండి పోరాడిన ఉద్యోగుల గౌరవార్థం ఈ జెర్సీలను ధరించనున్నాం. వీటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వనున్నాం. కరోనా కారణంగా దేశంలో ఏమవుతుందో తలుచుకుంటే భయమేస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. వాక్సిన్ వేసుకోండి' అని ఆర్‌సీబీ షేర్ చేసిన వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. సోమవారం(మే3వ తేదీ) అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.
ఇక్కడ చదవండి: ఆ బంతిని కూడా ఫోర్ కొడితే ఇంకేం చేస్తాం!
మీకు బౌలర్లు ఉన్నారు.. కానీ డెత్ ఓవర్ బౌలర్ ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment