మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి, పక్కన ఖలీల్ అహ్మద్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పదో డివిజన్లో గల ఉస్మాన్‌సాహెచ్‌పేట, ఎన్టీఆర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌తో కలిసి బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నగరాభివృద్ధి తమ హయాంలోనే జరిగిందంటూ నారాయణ తన మాటలను కోటలు దాటిస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో నెల్లూరు స్థిరమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. నగరంలో పార్కులు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి.. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
జాబ్‌మేళాల ద్వారా ఉపాధి
నెల్లూరులో స్థిరనివాసాన్ని ఏర్పర్చుకొని నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్లను నిర్వహించనున్నామని తెలిపారు.
రూ.52 కోట్లతో అభివృద్ధి
గడిచిన ఐదేళ్లలో పదో డివిజన్లో రూ.52 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు. ప్రధాన రోడ్ల నిర్మాణానికి రూ.ఆరు కోట్లు.. 9, 10 డివిజన్లకు సంబంధించి ఎఫ్‌సీఐ కాలనీలో అర్బన్ పీహెచ్‌సీని ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. రామ్‌నగర్, పల్లాపు కాలువలకు రక్షణ గోడలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రేబాలవారివీధిలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆధునికీకరిస్తామని చెప్పారు. నగరంలోని రైస్‌మిల్లుల్లో హమాలీలుగా పనిచేసే కార్మికులు ఈ డివిజన్లో నివసిస్తున్నారని, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
మరోసారి జగనన్నే సీఎం
జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఖలీల్ అహ్మద్ చెప్పారు. ఎమ్మెల్యేగా తనను.. ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. విజయసాయిరెడ్డిని గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నగరాధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్‌కుమార్, నేతలు ఆనం జయకుమార్, కిన్నెర ప్రసాద్, ముక్కాల ద్వారకానాథ్, మల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా
క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా
సింహపురిని మారుస్తా
వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment