నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని 108 వాహనాల్లో ఈఎంటీ, పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మేనేజర్ విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎంటీ పోస్టులకు జీఎన్‌ఎం, బీఎస్సీ లైఫ్ సైస్స్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పైలట్ పోస్టులకు పదో తరగతి పాసై, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 35 ఏళ్లలోపు వయస్సు, ఇంగ్లిష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలోని 108 జిల్లా కార్యాలయంలో ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అగ్నిప్రమాదాల
నివారణపై అవగాహన
నెల్లూరు(క్రైమ్): అగ్నిప్రమాద నివారణ చర్యలపై కోవూరులోని చౌదరి పెట్రోల్ బంక్ సిబ్బందికి బుధవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సహాయ అగ్నిమాపక అధికారి వేణుగోపాల్‌రావు మాట్లాడారు. ప్రమాదం సంభవిస్తే ఆక్సిజన్ అందకుండా డీసీపీ పౌడర్‌ను వాడాలని, తీవ్రత ఎక్కువైతే ఫోమ్‌ను వినియోగించాలని సూచించారు.
రూ.1.5 లక్షల సీజ్
ఉదయగిరి: మండలంలోని యర్రబల్లిగడ్డ వద్ద ఎలాంటి పత్రాల్లేకుండా తరలిస్తున్న రూ.1.5 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నారాయణ బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. సీతారామపురం మండలం బాలాయపల్లికి చెందిన ముత్తంశెట్టి కేశవరావు, వెంకటేశ్వర్లు కలిసి ద్విచక్రవాహనంపై శకునాలపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో యర్రబల్లిగడ్డ వద్ద వారి వాహనాన్ని తనిఖీ చేయగా, రూ.1.5 లక్షలను కనుగొన్నారు. ఎలాంటి పత్రాల్లేకపోవడంతో నగదును సీజ్ చేసి.. ఉదయగిరి పోలీస్‌స్టేషన్లో ఎస్సై ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు. తదుపరి ట్రెజరీలో జమచేయనున్నామని తెలిపారు.
ముగిసిన శ్రీరామకథా తరంగిణి సప్తాహం
నెల్లూరు(బృందావనం): రేబాలవారివీధిలోని పీటీజీ టవర్స్‌లో పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామకథా తరంగిణి సప్తాహం బుధవారంతో ముగిసింది. ఉత్తరకాండంపై విద్వాన్ డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు ఉపన్యసించారు. సభా పోష కుడిగా సత్యనారాయణ, సభాధ్యక్షుడిగా లక్ష్మీనరసింహరావు వ్యవహరించారు. రామచంద్రప్రసాద్, బలరామయ్యనాయుడు, రామకృష్ణప్రసాద్‌రావు, రాజశేఖర్, సుబ్బారావు, శ్రీనివాసులురెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment