ఓటు హక్కును వినియోగించుకోండి | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును వినియోగించుకోండి

Published Tue, May 7 2024 5:10 AM

ఓటు హక్కును వినియోగించుకోండి

నెల్లూరు(దర్గామిట్ట): ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో తమ ఓటును బుధవారంలోపు వినియోగించుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ కోరారు. నగరంలో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. వీఆర్‌, డీకేడబ్ల్యూ కళాశాలల్లోని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలంలోని క్యూబా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరళిని కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. ఆర్వో చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement