పేకాట స్థావరంపై దాడి ● | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి ●

Published Thu, Oct 31 2024 12:22 AM | Last Updated on Thu, Oct 31 2024 12:22 AM

-

రూ.8 లక్షల నగదు స్వాధీనం

ఆత్మకూరు: అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామ శివార్లలోని మామిడి తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో సీఐ జి.గంగాధర్‌, పలువురు ఎస్సైలు, సిబ్బంది కలిసి బుధవారం సాయంత్రం దాడి చేశారు. పోలీసులను చూసి కొందరు పారిపోగా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.8,08,465 నగదు, మూడు కార్లు, 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని బద్వేల్‌, గోపవరం మండలాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నలుగురు అనంతసాగరం మండలానికి చెందిన వారని డీఎస్పీ వివరించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. 15 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు ఎస్సై షేక్‌ జిలానీ, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసులు, అనంతసాగరం ఎస్సై సూర్య ప్రకాష్‌ రెడ్డి, ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement