● పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు
ఆత్మకూరు(చేజర్ల): మండలంలోని యనమదల గిరిజన కాలనీకి చెందిన ఓ మహిళపై స్థానిక టీడీపీ నాయకుడు ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామానికి చెందిన ఓ దినపత్రిక విలేకరి (సాక్షి కాదు) బుధవారం తన వద్దకు వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే నీ అంతు చూస్తామని, గ్రామం నుంచి గెంటేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై లేకపోవడంతో స్టేషన్లో సిబ్బంది ఫిర్యాదును తీసుకుని గురువారం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధిత మహిళను మళ్లీ వేధించడంపై జిల్లా గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం నిరసన తెలియజేయనున్నట్లు ఆ సంఘాల నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment