నెల్లూరు(క్రైమ్): అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఓ లీడింగ్ ఫైర్మెన్ బాణసంచా దుకాణంలో స్వయంగా విక్రయాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది లైసెన్స్లు పొందడం, విక్రయాలు సాగించడం నిబంధనలకు విరుద్ధం. అయితే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ లీడింగ్ ఫైర్మెన్ బుధవారం రాత్రి వీఆర్సీ గ్రౌండ్లో బాణసంచా దుకాణంలో స్వయంగా విక్రయాలు చేశారు. దీనిపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిని వివరణ కోరగా సిబ్బంది బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని, విక్రయాలు సాగించరాదని తెలిపారు. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment