నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తలు తప్పనిసరి
నెల్లూరు(క్రైమ్): దీపావళి అంటే ప్రతి ఒక్కరికీ ఆనందం. కులమతాలకు అతీతంగా అందరూ పండగ చేసుకుంటారు. ఇంటిల్లిపాది ఉత్సాహంగా మతాబులు కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. కాకరొత్తులు, చిచ్చుబుడ్ల వెలుగులు, టపాకాయల మోతలతో ఆ రోజంతా హోరెత్తుంది. రంగురంగుల వెలుగుల్లో ఏ మాత్రం అజాగ్రత్త, ఏమరపాటుగా ఉన్నా చాలా ప్రమాదం. ఆనందం కాస్తా అంధకారంగా మారుతుంది. నష్టం జరిగిన తర్వాత బాధపడడం కంటే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండగను సంతోషంగా జరుపుకోవచ్చు.
ప్రథమ చికిత్స ఇలా..
బాణసంచా కాల్చే సమయంలో గాయాలైతే కనీసం పది నిమిషాలపాటు చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా కాలిన ప్రాంతంలో ఉష్ణోగ్రత, నొప్పి తగ్గుతుంది. శీతలీకరణ అనంతరం ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రమైన క్లాత్ లేదా ప్లాస్టిక్ ర్యాప్‌తో కాలిన ప్రదేశాన్ని కవర్ చేయాలి. గాయం తీవ్రత అధికంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
దీపావళి సంబరాలకు వేళాయె
అప్రమత్తత ఎంతో అవసరం
లేకుంటే ఎన్నో ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment