కసుమూరులో బెల్టు దుకాణం మూత
వెంకటాచలం: మండలంలోని కసుమూరు గ్రామంలో మస్తాన్‌వలీ దర్గా సమీపంలో ఉన్న బెల్టు దుకాణాన్ని ఎకై ్స జ్ అధికారులు బుధవారం మూసి వేయించారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కసుమూరులో బెల్టు దుకాణం’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఎక్సైజ్ సీఐ పి.ప్రసన్నలక్ష్మి తన సిబ్బందితో అక్కడికి వెళ్లి బెల్టు దుకాణాన్ని మూసి వేయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పైపుల తయారీ ఫ్యాక్టరీలో చోరీ
● రూ.30 లక్షల విలువైన
పరికరాల మాయం
వెంకటాచలం: మండలంలోని సర్వేపల్లి వద్దనున్న యూపీఐ పాలిమర్స్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రూ.30 లక్షల విలువ చేసే పరికరాలను అపహరించారు. దుండగులు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఫ్యాక్టరీలోకి ప్రవేశించి విలువైన వస్తువులను చోరీ చేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో నమోదై ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం బుధవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే ఫ్యాక్టరీలో రెండుసార్లు చోరీ జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన చోరీ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment