ప్రభుత్వం మాదే.. మట్టి తవ్వేస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మాదే.. మట్టి తవ్వేస్తాం

Published Thu, Oct 31 2024 12:22 AM | Last Updated on Thu, Oct 31 2024 12:22 AM

ప్రభుత్వం మాదే.. మట్టి తవ్వేస్తాం

ప్రభుత్వం మాదే.. మట్టి తవ్వేస్తాం

వెంకటాచలం: మండలంలోని బురాన్‌పూర్‌ చెరువులో మూడు రోజుల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి అనుకుని ఉన్న చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు చేస్తుండడంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. వాటిల్లో గేదెలు, మనుషులు పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధికార పార్టీకి చెందిన వారు దౌర్జన్యానికి దిగుతున్నారు. చెరువులో అక్రమ తవ్వకాలపై వీఆర్వో, ఇరిగేషన్‌ అఽధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. నెల్లూరు నగరానికి దగ్గరగా ఈ చెరువు ఉంది. ఒక్కో ట్రాక్టర్‌ను రూ.2,000 లెక్కన అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement