రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సృష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ కొన్ని చానల్స్‌లో వస్తున్న ప్రచారాలపై ఆయన ఘాటుగా స్పందించారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన మీద వార్తలు రాసి టీఆర్పీలు పెంచుకోవాలని కొన్ని చానల్స్ అత్యుత్సా హం ప్రదర్శిస్తున్నాయన్నాయని, తద్వారా చానల్స్ రేటింగ్‌లు పెరుగుతాయంటే ఏమైనా రాసుకోవచ్చన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని, నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. పాత కేసుల్లో తన పేరు ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయాలంటూ కొందరు లోకేశ్ వెంట తిరుగుతున్నారన్నారు. అధికారం చేతిలో పెట్టుకుని, తనపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. పల్నాడుకెళ్లి తాను పోటీ చేస్తే ఎమ్మెల్యేల కంటే తనకే 40 వేలు ఓట్లు అధికంగా వచ్చాయన్నారు. అక్కడి వారు తనపై ఎంతో అభిమానం చూపించారని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను అక్కడికి వెళ్లానంటే కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసమే కార్యకర్తలు ఆహ్వానిస్తున్నా వెళ్లలేకపోతున్నానన్నారు. నన్ను ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపి శునకానందం పొందినా, తాను భయపడేది లేదన్నారు. తనపై అలాంటి ఆలోచనలు చేసే వారి వయస్సు తనకంటే పది పదిహేనేళ్లు పెద్దవారేనన్నారు. తాను జైలుకు వెళ్లినా కూడా ఎంతో ఫిట్‌గానే ఉంటానని, తిరిగి మళ్లీ తాము అధికారంలోకి వచ్చినప్పుడు వారంతా వృద్ధాప్యంలో ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. అక్రమ కేసులు బనాయించాలనుకోనే వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తమకు పార్టీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమని, ఆయన కోసం వంద కాదు వెయ్యి అడుగులైనా వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రేటింగ్‌లు పెరుగుతాయంటే
నామీద ఏమైనా రాసుకోండి
త్వరలోనే యాక్టివ్ అవుతా
అధికారం అడ్డుపెట్టుకుని శునకానందం
మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment