అంత్యక్రియలకు డబ్బుల్లేక..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేక కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద నిరీక్షిస్తున్న హృదయ విదారక ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన దేవుళ్ల వెంకమ్మకు పక్కాగృహం వచ్చింది. దాని నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆమె తన కుమారుడు పెంచలయ్య (49), కోడలు రాజేశ్వరితో కలిసి ఫ్లై ఓవర్ కింద నివాసం ఉంటోంది. పెంచలయ్య బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడికి గుండెనొప్పి రావడంతో తల్లి, భార్య జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పెంచలయ్య మృతి చెందాడని వైద్యులు చెప్పారు. సొంతిల్లు లేదు. అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో వెంకమ్మ, రాజేశ్వరి ఫ్లై ఓవర్ కింద మృతదేహాన్ని పెట్టుకుని రోదిస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కార్పొరేషన్ అధికారులు స్పందించి అంత్యక్రియలు నిర్వహించాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment