నెల్లూరు (పొగతోట)/రాపూరు: విధి నిర్వహణలో అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఓ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీలో కార్యదర్శులుగా పనిచేసిన టి.రాజశేఖర్, బి.మస్తానయ్యపై నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదికలు అందజేయడంతో వారిని సస్పెండ్ చేశారు.
మహిళను లైంగికంగా వేధించిన..
తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన గిరిజన మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో రాపూరు మండలంలోని రాపూరు సిద్ధవరం, జోరేపల్లి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న చెంచయ్యను సస్పెండ్ చేశారు. సిద్ధవరం పంచాయతీ కోటూరుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నాగలక్ష్మి తన తండ్రి శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా సర్టిఫికేట్ ఇవ్వకుండా లైంగికంగా వేధింపులకు గురి చేయడం, వీడియో కాల్‌లో చూడాలని, గూడూరుకు రావాలని వేధిస్తుండడంతో ఈ నెల 4వ తేదీ కలెక్టర్‌కు, ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. విచారించిన అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment