తమ్ముళ్లకు పండగలా మారిన సీసీ రోడ్ల నిర్మాణం
● రూ.22 కోట్ల మంజూరు
● నాసిరకంగా ప్రక్రియ
● ఇసుక స్థానంలో అంతా మట్టే
● కొరవడిన పర్యవేక్షణ
ఉదయగిరి: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. సొంత పార్టీల నేతల కడుపులు నింపేందుకు అవినీతి, అక్రమాలకు కూటమి ప్రభుత్వం బాటలేసింది. ఉపాధి నిధులను కొల్లగొట్టడమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.కోట్ల విలువజేసే పనులను కట్టబెట్టింది. అధికారుల అండతో నిధుల స్వాహానే ధ్యేయంగా పెట్టుకొని అరకొరగా.. నాణ్యతకు తిలోదకాలిచ్చి వీటిని నిర్మిస్తున్నారు.
ఇదీ తంతు..
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల పేరుతో ఉపాధి నిధులను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. తదనుగుణంగా పల్లెపండగ పేరుతో అక్టోబర్ 14 నుంచి 20 వరకు తెలుగు తమ్ముళ్లు శంకుస్థాపనలు చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు రుచి మరిగి రూ.కోట్లు దోచేసిన వీరికి మరోమారు ఆకలి తీర్చుకునే అవకాశాన్ని కల్పించారు.
నాణ్యత ప్రశ్నార్థకం
జిల్లాలో జాతీయ ఉపాధి నిధులతో మెటీరియల్ కాంపోనెంట్ కింద మొదటి దశలో రూ.80 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 100 రోజుల్లో.. అంటే సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే ఇవి స్థానిక పంచాయతీ పాలకవర్గాలు, సర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలు, కార్యకర్తల ప్రయోజనాల కోసమే ఉపాఽధి నిధులతో ఈ పనులను చేపట్టారనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది.
పర్యవేక్షణేదీ..?
మొదటి విడతలో ప్రతి మండలానికీ రూ.రెండు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇలా ఉదయగిరి నియోజకవర్గంలో రూ.22 కోట్లను ఖర్చు చేయనున్నారు. మరోవైపు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత డొల్లగా మారింది. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఒకవేళ ఏ అధికారైనా నాణ్యత విషయమై ప్రశ్నిస్తే, తాము అఽధికార పార్టీకి చెందిన వారిమని, తాము చెప్పినట్లే చేయాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ విషయమై ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేసినా, వారి నుంచి సహకారం లభించడంలేదని కొందరు ఇంజినీంగ్ అసిస్టెంట్లు, ఏఈలు పేర్కొంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు, జలదంకి, కలిగిరి మండలాల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది.
నాణ్యతలో రాజీ లేదు
నాణ్యత విషయంలో రాజీలేదు. ఎక్కడైనా నాసిరకం ఇసుక, కంకరను వినియోగిస్తున్నారని మా దృష్టికి తెస్తే పనులను నిలిపేయిస్తాం. నాణ్యతగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. అంచనాల్లో పేర్కొన్న విధంగా సామగ్రిని తెప్పించి, నాణ్యతగా పనులు చేయిస్తాం.
– శ్రీనివాసరాజు, ఏఈ,
పంచాయతీరాజ్, ఉదయగిరి
Comments
Please login to add a commentAdd a comment