ఉత్సాహంగా స్పోర్ట్స్ మీట్
నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఎక్కువ మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని వీసీ విజయభాస్కర్‌రావు పేర్కొన్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో వీఎస్‌యూ ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ ఫర్ ఉమెన్ పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనే జట్లను పరిచయం చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని చెప్పారు. అనంతరం ఇటీవల నిర్వహించిన వర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచిన కావలికి చెందిన శ్రీసాయి.. రన్నర్స్‌గా నిలిచిన డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలల క్రీడాకారులకు కప్పులను అందజేశారు. రిజిస్ట్రార్ సునీత, కళాశాల ప్రిన్సిపల్ గిరి, వర్సిటీ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వెంకటరాయులు, కళాశాల పీడీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయకళ, వర్సిటీ పరిశీలకులు అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా..
వర్సిటీ పరిధిలోని 15 డిగ్రీ కళాశాలలకు చెందిన 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఖోఖో, వాలీబా ల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్, యోగా, బాల్‌బ్యాడ్మింటిన్, టగ్ ఆ్‌ఫ్ వార్ పోటీలను నిర్వహించా రు. ఖోఖో పోటీల్లో కావలికి చెందిన ఎమ్మెస్సార్, శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలు.. వాలీబాల్ పోటీల్లో డీఆర్‌డ బ్ల్యూ, వీఎస్‌యూ కళాశాలలు.. హ్యాండ్‌బాల్ పోటీల్లో శ్రీసాయి, పీఆర్‌ఆర్వీఎస్ డిగ్రీ కళాశాలల జట్లు తలప డ్డాయి. పోటీలు ఆదివారం కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment