పోటెత్తిన ప్రజాగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన గళం
కరెంటు బిల్లులనే
ఉరితాడుగా మెడలో వేసుకొని నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు నగరంలో లాంథర్ ప్లకార్డుతో మహిళ నిరసన
వెంకటాచలంలో..
సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ పోరుబాట చేపట్టారు. కసుమూరు రోడ్డు నుంచి విద్యుత్ సబ్ స్టేషను వరకు వేలాది మంది పార్టీ శ్రేణులతో పాటు విద్యుత్ వినియోగదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
కందుకూరులో..
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం కందుకూరులో విజయవంతంగా సాగింది. నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
బుచ్చిరెడ్డిపాళెంలో..
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల మేర నెల్లూరు – ముంబయి జాతీయ రహదారిపై వేలాది మంది ప్రజలతో నిరసన ర్యాలీ చేపట్టి హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment