ఉదయగిరిలో..
ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట జరిగింది. స్థానిక ట్యాంక్‌బండ్‌పై ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వందలాది మంది నేతలు, కార్యకర్తలతో ట్యాంక్ బండ్ మీదుగా బస్టాండు వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత మున్సిపల్ బస్టాండు ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీలు ప్రసన్నలక్ష్మి, పీర్ల పార్థసారథి, పి.రాజేశ్వరమ్మ, కమతం శోభ, టి.విజయ భాస్కర్‌రెడ్డి, బోయిళ్ల పద్మజారెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ పాల్గొన్నారు.
కావలిలో..
కావలి పట్టణంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ పోరుబాట చేపట్టారు. పట్టణంలోని ట్రంక్‌రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment