నాకేమీ తెలియదు
డబ్బు కోసం
కన్నబిడ్డల అమ్మకం
● మినగల్లులో ఘటన
బుచ్చిరెడ్డిపాళెం : ఏ పనిచేయకుండా అల్ప సంపాదనతో జీవనం సాగించవచ్చన్న ఉద్దేశంతో కన్నబిడ్డలను అమ్మకాలు చేస్తున్న ఓ కసాయి దంపతుల వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన రవి, వెంకమ్మలకు ముగ్గురు సంతానం. వారిలో మొదటి బిడ్డను ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వారికి విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. రవి తన ఏడేళ్ల వయసున్న రెండో కుమారుడిని తీసుకుని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వెళ్లిపోయాడు. దీనిపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వెంకమ్మను ఆరా తీయగా వారు తమకు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదని హైదరాబాద్‌లో రూ.లక్ష ఇస్తామని చెప్పి నా భర్తను, బిడ్డను తీసుకెళ్లినట్టు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నా భర్త పిల్లలను ఎవరికి విక్రయిస్తున్నారో నాకు తెలియదు. ఆదివారం వచ్చిన ఓ వ్యక్తి పిల్లవాడిని తీసుకుని లక్ష రూపాయలను రవి చేత పంపిస్తానని చెప్పారు. ఇక్కడ మాత్రం నాకు డబ్బులు ఇవ్వలేదు. – వెంకమ్మ
Comments
Please login to add a commentAdd a comment