No Headline
2025–26 కేంద్ర బడ్జెట్‌లో సింహపురి అభివృద్ధికి మొండిచేయి చూపించారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలకంగా ఉండడంతో పెండింగ్ ప్రాజెక్ట్‌లకు మోక్షం లభిస్తుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్ట్‌ల భవిష్యత్ ఊసెత్తకుండానే నిర్మలమ్మ పద్దు వెల్లడించారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన అనేక ప్రాజెక్ట్‌ల పురో‘గతి’ లేకుండా పోయింది.
● నిర్మలమ్మ ‘పద్దు’ మళ్లీ నిరాశే
● పట్టాలెక్కని నడికుడి –
శ్రీకాళహస్తి లైన్
● దగదర్తి విమానాశ్రయం,
బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్ట్‌ల ఊసేలేదు
● రామాయపట్నం పోర్టు,
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంతే
● కృష్ణపట్నంలో క్రిస్ సిటీ
పరిస్థితిలో మార్పు లేదు
● ఎన్పీఈఆర్బీకే, తెలుగు
అధ్యయన కేంద్రానికి మొండిచేయి
రూ.12.75 లక్షల వరకు పన్ను లేదని చెప్పడం పెద్ద అబద్ధం. ప్రత్యక్ష ఆదాయం పొందే వర్గ ప్రయోజనాల కోసం పన్నుల విధానాన్ని రూపొందించాలి. ఉద్యోగులు అన్ని రకాల పన్నులు చెల్లిస్తుంటే మళ్లీ ఆదాయపు పన్ను వేయడం బాధాకరం. జీతానికి వృత్తి పన్ను చెల్లిస్తుండగా ఒకటిన్నర నెల ఆదాయపు పన్ను పేరుతో కట్టించుకోవడం దారుణం.
– మోహన్‌దాస్, ఏపీటీఎఫ్
రాష్ట్ర నాయకుడు
పన్ను స్లాబులు దోపిడీకి పరాకాష్ట
విద్యకు తగినన్ని కేటాయింపులు లేవు
Comments
Please login to add a commentAdd a comment