No Headline
రాష్ట్రం అప్పుల్లో ఉందని రాష్ట్ర ప్రజలపై కూటమి సర్కార్ ట్యాక్సులు, విద్యుత్ చార్జీల రూపంలో భారం మోపడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి వచ్చిందని, ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, అయితే బీజేపీతో జతకట్టి కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో మత విద్వేషాలు ఏర్పడ్డాయన్నారు. చంద్రబాబు దావోస్, సింగపూర్‌కు వెళ్లినా ఒక్క కంపెనీని తీసుకురాలేక పోయారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే కంపెనీలు అవే వస్తాయన్నారు. పవన్ కల్యాణ్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, టీడీపీ మనుగడ కూడా కోల్పోతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందని కార్మికుల జీతాలు కోత పెట్టే బదులు రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎమ్మెల్యేలు, మంత్రులు జీతాలను త్యాగం చేస్తే బాగుంటుందన్నారు. అనంతరం సీపీఎం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్, పుణ్యవతి, వెంకట్, మధు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు మూలం రమేష్, నాయకులు మోహన్‌రావు, చండ్ర రాజగోపాల్, వి వెంకటేశ్వర్లు, డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు, రెహనాబేగం, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సీపీఎం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు గతేడాది కంటే తగ్గించారు. వ్యవసాయ రంగాన్ని వదిలేసి కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీల ప్రయోజనాల కోసమే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించినట్లు ఈ బడ్జెట్ ఉంది. జాతీయ నేరాల బ్యూరో అందించిన రిపోర్టు ప్రకారం దేశంలో 2017 నుంచి 2022 వరకు 1,00,474 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లెక్కన రోజుకు సగటున 34 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని, దీనికి పూర్తి బాధ్యత కేంద్రం, ప్రధాని మోదీ, అమిత్‌షా, నిర్మలాసీతారామన్ వహించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని, 21 మంది ఎంపీల బలమున్న రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో ఏ విధంగానూ కేటాయింపులు లేవన్నారు. రాష్ట్రంలో బీజేపీతో కలిపి ప్రభుత్వంఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన నాయకులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్‌లోని సీతారాం ఏచూరి ప్రాంగణంలో శనివారం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గపూర్ అధ్యక్షతన సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంఎ బేబి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, దళితులు, గిరిజనులు, రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆకలి చావులు, మూడు పూటలు తిండికి నోచుకోని ప్రజలు ఉన్న 127 దేశాల జాబితాలో భారత్ 106వ స్థానంలో ఉందన్నారు.
సైద్ధాంతిక విభేదాలు కావు, రాజకీయ విభేదాలే – కె.రామకృష్ణ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సీపీఎం రాష్ట్ర 27వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం విశాఖలో జరిగిన సీపీఐ సమావేశాల్లో నేడు బేబి చెప్పిన అంశాలు, విషయాలపై తాము చర్చించడం జరిగిందన్నారు. సీపీఎం, సీపీఐ మధ్య సైద్ధాంతిక విభేదాలు లేవని, రాజకీయ విభేదాలనే అన్నారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంటి ప్రభుత్వాలను ఇప్పటి వరకు చూడలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ, మతపర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకే ఉందన్నారు. రాష్ట్రంలో అమలు కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆర్థిక పరిస్థితి బాగా లేదని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు విజన్–2047 అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రూ.3 లక్ష కోట్లు ఆర్థిక సాయం ఇచ్చామని చెబితే.. చంద్రబాబు మాత్రం డబ్బులు లేవని చెబుతున్నారన్నారు. ఆ రూ.3 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. గతంలో జగన్ సర్కార్ అప్పు చేసిందని ప్రచారం చేసిన మీరు.. నేడు అమరావతి పేరుతో వేల కోట్లు అప్పు తీసుకురావడం లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment