వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
● ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు(క్రైమ్): మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో జిల్లా సాయుధ బలగాల సిబ్బందికి యాన్యువల్ మొబిలైజేషన్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా సాయుధ దళం సంక్లిష్ట విభాగమని, సాధారణ బందోబస్తు మొదలుకొని శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీ, వీవీఐపీల భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వృత్తిపరమైన నైపుణ్యాలు, మెలకువలను ఏకాగ్రతతో సాధన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. అత్యాధునిక ఆయుధాల వినియోగం, ఫైరింగ్, డ్రిల్, మార్చ్‌పాస్ట్, మాబ్ కంట్రోల్ తదితర అంశాల్లో నైపుణ్యాల మెరుగునకు మొబిలైజేషన్ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు నగర, రూరల్, ఏఆర్ డీఎస్పీలు సింధుప్రియ, శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఆర్‌ఐలు అంకమరావు, హరిబాబు, రాజారావు, పౌల్‌రాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment