కస్టమర్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ తయారీ
జిల్లాలో పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ఆయా రంగాల్లో చిన్న తరహా నుంచి పెద్ద తరహా వ్యాపారాలు, కంపెనీల వారికి అవసరమైన విధంగా సాఫ్ట్‌వేర్‌లను రూపొందించి ఇస్తున్నారు. రిటైల్, హోల్‌సేల్, సూపర్ మార్కెట్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్స్, ఆన్‌లైన్ షాపింగ్, వెబ్‌సైట్స్‌కు అనుగుణంగా బిల్లింగ్‌లకు సాఫ్ట్‌వేర్‌లను సిద్ధం చేస్తున్నారు. పనిఒత్తిడి తగ్గడంతో బిల్లింగ్ వేగవంతంగా ఉండే విధంగా వారికి కావలసిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తారు. స్వచ్ఛంద ట్రస్ట్‌లకు, కళాశాలలకు, పాఠశాలలకు, యూనివర్సిటీలకు మరి కొన్ని రంగాలకు ఇంటర్‌నెట్‌లో పబ్లిక్ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు.
సొంతంగా ఉపాధి
కల్పించుకున్నాను
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోర్సును 12 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. సొంతంగా నెల్లూరులోనే కంపెనీ ఏర్పాటు చేసుకుని మరి కొందరికి ఉపాధి కల్పిస్తున్నాను. ప్రస్తుతం యువత తాము చదివిన చదువుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రాక నిరాశ పడుతున్నారు. ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చు. స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా సొంతంగా ఉపాధి కల్పించేందుకు వీలు ఉంటుంది.
– అబ్దుల్ రజాక్, ఆప్టిమస్ ఐటీ సొల్యూషన్స్ నిర్వాహకుడు
పనిచేస్తున్న ఉద్యోగులు
●
నిత్యం కొత్తగా
నేర్చుకుంటూనే ఉంటాం
15 ఏళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉన్నాను. కొత్త వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్ యాప్స్‌ను రూపొందిస్తుంటాం. ప్రస్తుత టెక్నాలజీలో నిత్యం కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం. అదే విధంగా కస్టమర్‌లకు నాణ్యమైన సేవలు అందించడంలో ఇతర సంస్థలతో పోటీ పడాల్సి ఉంది.
– అల్తాఫ్ బాషా, ఎస్‌ఏబీ సాఫ్ట్ నిర్వాకుడు
Comments
Please login to add a commentAdd a comment