No Headline
నెల్లూరు సిటీ: సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ రంగ సంస్థలు కొలువులకు కోతలు విధిస్తున్నాయి. భవిష్యత్ కలలతో కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసినా.. ఉద్యోగాలు లేక ఎంతో మంది యువత ఖాళీగానే ఉండిపోతున్నారు. ఉద్యోగాలు కల్పించే కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు పూర్వానుభవం అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో దొరికిన చిన్న ఉద్యోగాలు చేయలేక.. మంచి ఉద్యోగాలు పొందలేక యువత నలిగిపోతోంది. అయితే కొంత మంది సాఫ్ట్‌వేర్‌లు ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా తమ కాళ్లపై తామే నిలబడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తమ వద్ద టాలెంట్ ఉంటే మనం ఉద్యోగం చేయడం ఎందుకు.. మనమే ఉద్యోగాలు కల్పించవచ్చని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్’ కోర్సులను నేర్చుకుని తామే వెబ్‌సైట్లు, యాప్స్‌ను రూపొందిస్తున్నారు.
జిల్లాలో 20 వరకు ‘సాఫ్ట్‌వేర్’ సంస్థలు
సాఫ్ట్‌వేర్ కొలువులకు ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, పూణే అడ్డాగా ఉన్నాయి. తాజాగా సింహపురికి చెందిన టాలెంటెడ్ సాఫ్ట్‌వేర్స్ నెల్లూరును ‘సాఫ్ట్‌వేర్’ హబ్‌గా మార్చేస్తున్నారు. ప్రధాన నగరాల్లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోర్సును నేర్చుకుని తమ సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించుకుంటున్నారు. (mysql, python, php, hmtl, css, javascript, react, nodejs, android, ios, java) ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామింగ్‌ను తయారు చేస్తున్నారు. సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా కమాండ్స్ ద్వారానే పూర్తి చేయాల్సి వస్తుంది.
స్వయం ఉపాధి కల్పించుకుంటున్న యువత
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోర్సును నేర్చుకున్న కొంత మంది నెల్లూరుకు చెందిన యువత సొంతంగా జిల్లాలోనే ఓ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు 20 సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆయా సంస్థల ద్వారా వందల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌ను నియమించుకుని తాము ఉపాధి పొందుతూ, మరి కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలోని వ్యాపారస్తులకు, కంపెనీలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాఫ్ట్‌వేర్‌తోపాటు కొన్ని యాప్స్‌ను, సాఫ్ట్‌వేర్‌లను, వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు. నెల్లూరులోని పలు సంస్థలు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకు సొంత ఊర్లలోనే ఉపాధి కల్పించేందుకు దోహద పడుతున్నాయి. జిల్లాలో సాఫ్ట్‌వేర్‌లో వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
ఉద్యోగాల కోసం ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్
Comments
Please login to add a commentAdd a comment