నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నెల్లూరు (పొగతోట): విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ గంగాభవాని స్పష్టం చేశారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి టీఏలు, ఈసీలు, ఏపీఓలు, ఏపీడీలతో బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. మినీ గోకులాల నిర్మాణాలను ఈ నెల 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసిన మండలాలకే కొత్త అనుమతులను మంజూరు చేయనున్నామని వెల్లడించారు. జిల్లాలో రూ.31 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేశామన్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచాలని చెప్పారు. పనుల కల్పనలో నెల్లూరు, కోవూరు, కావలి, అల్లూరు, బోగోలు తదితర మండలాలు వెనుకబడి ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై లిఖితపూర్వక ఫిర్యాదును అందజేయాలని ఏపీడీలను ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment