నెల్లూరు(క్రైమ్): చీటీల పేరిట పలువుర్ని మోసగించి కుటుంబంతో సహా పరారైన నిర్వాహకురాలిపై బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. సరస్వతీనగర్‌కు చెందిన లక్ష్మి వద్ద పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 15 మంది రూ.లక్షల్లో చీటీలను వేశారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 23న తన కుటుంబంతో కలిసి ఎటో వెళ్లిపోయారు. ఆమె కోసం బాధితులు గాలించినా ప్రయోజనం లభించలేదు. దీంతో ఆమె చేతిలో మోసపోయిన ఆదిలక్ష్మి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment