వీఎస్‌యూ విద్యార్థులకు అభినందన
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) పరిశోధక విద్యార్థులను ఇన్‌చార్జి వీసీ విజయభాస్కర్‌రావు శనివారం అభినందించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సదస్సు మైక్రోబయో వరల్డ్‌ను గురు, శుక్రవారాల్లో నిర్వహించారు. ఫుడ్ టెక్నాలజీ విభాగ
అధ్యాపకుడు డాక్టర్ సాయినాథ్ పర్యవేక్షణలో నాగరాజు సమర్పించిన పరిశోధన పత్రం ప్రశంసలు పొంది ఉత్తమ అవార్డును దక్కించుకుంది. బయో టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కిరణ్మయి పర్యవేక్షణలో పరిశోధన విద్యార్థి కృష్ణ జశ్వంత్ సమర్పించిన పరిశోధన పత్రానికి గుర్తింపు లభించింది. దీంతో వీరిని అభినందించారు.
కోలుకున్న నర్సింగ్
కళాశాల విద్యార్థులు
నెల్లూరు(అర్బన్): ఫుడ్ పాయిజనింగ్‌తో ఇబ్బంది పడిన దుర్గా నర్సింగ్ కళాశాల విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని డీఎంహెచ్‌ఓ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రమౌళీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, ప్రత్యేక టీమ్‌ను అక్కడికి శుక్రవారం సాయంత్రం పంపానని చెప్పారు. సంక్రాంతి సెలవుల అనంతరం కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు మాంసంతో చేసిన ఊరగాయను తినడంతో పది మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందనే విషయాన్ని తమ బృందం తెలుసుకుందన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, యాజమాన్యంతో మాట్లాడి తగు సలహాలు, జాగ్రత్తలను చెప్పామని పేర్కొన్నారు. పెద్దాస్పత్రిలో అడ్మిటైన వారు డిశ్చార్జి కావడంతో తాను వెళ్లలేకపోయానని వివరించారు.
పొగాకు బ్యారన్ దగ్ధం
కొండాపురం: మండలంలోని సత్యవోలు పంచాయతీ అగ్రహారంలో పొగాకు బ్యారన్ దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మార్తుల పెదవెంకటేశ్వర్లుకు చెందిన బ్యారన్‌లో పొగాకు క్యూరింగ్ చేయసాగారు. ఈ క్రమంలో ఆకు గొట్టాలపై పడి మంటలు వ్యాపించాయి. దీంతో వింజమూరు అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు. వారొచ్చేలోపే బ్యారన్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. మంటలకు బ్యారన్ గోడలు బాగా కాలిపోయాయి. నీళ్లు చల్లడంతో ఇవి కూలిపోయాయి. మరోవైపు ఇది జాయింట్ కావడంతో పక్కనే ఉన్న చిన వెంకటేశ్వర్లుకు చెందిన బ్యారన్‌కు నిప్పంటుకుంది. దీంతో అందులోని టైర్లు, ఆకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ.మూడు లక్షల నష్టం సంభవించిందని స్థానికులు తెలిపారు.
టెక్నికల్ సర్టిఫికెట్
కోర్సు ఫలితాల విడుదల
నెల్లూరు (టౌన్): టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన లోయర్, హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కుల జాబితాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందుబాటు లో ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు తమ హా ల్ టికెట్లతో దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లోని పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
చట్టాలపై అవగాహన
పెంచుకోవాలి
బిట్రగుంట: చట్టాలపై మహిళలు అవగాహన పెంపొందించుకొని రక్షణ పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వాణి పేర్కొన్నారు. విధాన్ సే సమాధాన్ కార్యక్రమంలో భాగంగా కప్పరాళ్లతిప్పలోని వెలుగు కార్యాలయంలో మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సును జాతీయా మహిళా కమిషన్, జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలు, ఉచిత న్యాయసాయం పొందే విధానాలు, లోక్ అదాలత్ తదితరాలపై అవగాహన కల్పించారు. కావలి సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్‌పర్సన్ శోభ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ విక్రమసింహ, స్పెషల్ మెజిస్ట్రేట్ పరశురామ్, లోక్‌అదాలత్ సభ్యులు మాలకొండారెడ్డి, కావలి బార్ అసొసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిమ్మ ధరలు
పొదలకూరు (కిలో)
పెద్దవి : రూ.30
సన్నవి : రూ.18
పండ్లు : రూ.10
Comments
Please login to add a commentAdd a comment