No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 1:15 AM

No He

కదిరి: దౌర్జన్యాలు..దందాలు..దాడులు..ఇలా చెప్పుకుంటూ పోతే కందికుంట వెంకటప్రసాద్‌ చేయని అరాచకాలు లేవు. గత ఐదేళ్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన చేసిన ఆగడాలు అన్నీఇన్నీ కావు. అందుకే కందికుంట పేరు చెబితేనే అధికారులు భయపడిపోతున్నారు. ఆయన అనుచరులు కూడా అదేదారిలో నడుస్తున్నారు. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే... పొరపాటును గెలిస్తే పరిస్థితి ఏమిటని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఐదేళ్ల అరాచకాలను తలచుకుంటూ గట్టిగా బుద్ధిచెప్పేందుకు సిద్ధమైంది.

అధికారులపై కందికుంట చేసిన

దౌర్జన్యాల్లో కొన్ని..

● కదిరి ఎన్‌జీఓ కాలనీలో భూతగాదా విషయంలో తనకు అనుకూలంగా వ్యవహరించనందుకు అప్పటి కదిరి టౌన్‌ సీఐగా ఉన్న సొంత సామాజికవర్గానికి చెందిన తమ్మిశెట్టి మధుపై కందికుంట, ఆయన అనుచరులు దాడికి దిగారు. భూమిని చదును చేయడానికి అక్కడికి తీసుకొచ్చిన జేసీబీపై రాళ్లదాడి చేసి.. పెట్రోలు పోసి తగులబెట్టాలని ప్రయత్నించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సీఐని పత్రికల్లో రాయలేని భాషలో దూషించారు. ఆ తర్వాత నేరుగా సీఐ ఇంటిపైకి దాడికి దిగి.. కుటుంబసభ్యులను భయాందోళనలకు గురిచేశారు. ‘సీఐ మధు మా అన్న కందికుంటకు వ్యతిరేకంగా ఉన్నారు. సీఐని చంపితే వాడికి దిక్కెవరు..’ అంటూ కందికుంట అనుచరుడొకరు ఏకంగా ఆడియో కూడా విడుదల చేశారు. ఇది అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అంతకుముందు మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనూ కందికుంట వెంకటప్రసాద్‌ తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళుతుంటే ఇదే సీఐ మధు అడ్డుకున్నారు. దీంతో ఆ సీఐపై కందికుంట దౌర్జన్యానికి దిగారు.

● కదిరిలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణల తొలగింపు విషయంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రహిమాన్‌ను కందికుంట తీవ్ర పదజాలంతో బెదిరించారు. ‘నీపై దాడి చేస్తే ఎవర్రా నీకు దిక్కు..’ అంటూ అందరి ముందూ ఆయనపైకి దూసుకెళ్లారు.

● కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న బీసీ (రజక) సామాజికవర్గానికి చెందిన కె.ప్రమీళను మహిళ అని కూడా చూడకుండా తనమాట విననందుకు పలుమార్లు బూతులు తిట్టారు. ఏకంగా ప్రెస్‌మీట్లు పెట్టి ఎన్నోసార్లు ఆమెను వ్యక్తిగతంగా దూషించారు.

● మదనపల్లి నుంచి బదిలీపై కదిరి మున్సిపాలిటీకి కమిషనర్‌గా వచ్చిన ఎస్టీ మహిళ సుశీలమ్మపైనా కందికుంట తీవ్రస్థాయిలో దౌర్జన్యానికి దిగారు. ‘నా అనుమతి లేకుండా ఇక్కడికి బదిలీపై ఎలా వస్తావు?’ అంటూ ఆమెను విధుల్లో చేరకుండా అడ్డుకుంటూ కందికుంటతోపాటు అనుచరులు దాడికి దిగారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ విధుల్లో చేరకుండానే వెనుదిరిగారు.

● మామూళ్లు ఇవ్వనందుకు కదిరి నియోజకవర్గంలోని వెలిచలమల రోడ్డు పనులు ఆపి అప్పటి ఆర్‌అండ్‌బీ డీఈ రాజగోపాల్‌ను బెదిరించారు. చివరకు తోటి ఉద్యోగులంతా చందాలు వేసుకుని కందికుంటకు కప్పం కట్టారు.

● కదిరి మండలంలోని హమాలీ కాలనీలో తన అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా ఇంటిపట్టాలు ఇవ్వనందుకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అప్పటి తహసీల్దార్‌ పి.వి.రమణను కందికుంట అందరి ముందు దూషించారు. మండల మేజిస్ట్రేట్‌ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టారు. ‘నువ్వు నాకన్నా తక్కువ చదువుకున్నావు. నిన్ను ఏసీబీకి పట్టించడం నాకు రెండు నిమిషాలు కూడా పట్టదు. ఇంటిపట్టాలు ఇవ్వమంటే రూల్స్‌ మాట్లాడతావా? నాకు అనుకూలంగా ఉన్నాడని ఒక వీఆర్‌ఓను బదిలీ చేసి బ్రోకర్‌ను తెచ్చుకుంటావా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్‌ కేసు నమోదైంది.. నీకు తెలీదేమో’ అని అప్పట్లో ఆయన అన్న మాటలను అధికారులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.

అధికారులకు కందికుంట ఫోబియా

పేరు చెబితేనే భయపడిపోతున్న వైనం

గత ఐదేళ్లూ ఆయన దౌర్జన్యాలు

తలచుకుని బెంబేలు

వ్యక్తిగత దూషణలను గుర్తు

చేసుకుంటున్న యంత్రాంగం

ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధం

No Headline
1/4

No Headline

No Headline
2/4

No Headline

No Headline
3/4

No Headline

No Headline
4/4

No Headline

Advertisement

తప్పక చదవండి

Advertisement