సర్వర్ సతాయింపు
పుట్టపర్తి అర్బన్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాలో ఆలస్యంగా సాగింది. ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది తెల్లవారుజామునే గ్రామాలకు వెళ్లినా సర్వర్ సమస్యతో ఉదయం పింఛన్ పంపిణీ సరిగా చేయలేకపోయారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు, రచ్చకట్టల వద్ద వేచి చూస్తూ గడిపారు. మధ్యాహ్నం నుంచి సర్వర్ పనిచేయడంతో అందరినీ ఒకేచోటకు పిలిపించి పింఛన్ మొత్తం అందజేశారు. ఈ క్రమంలో దివ్యాంగులు, వివిధ జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నవంబర్ నెల సంబంధించి జిల్లాలో 2,66,137 మందికి ప్రభుత్వం రూ.114.26 కోట్లు మంజూరు చేయగా, తొలిరోజు 91 శాతం పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు.
4,836 పింఛన్లకు కోత..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రతి నెలా పింఛన్ జాబితాలో అర్హుల పేర్లు గల్లంతు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా పింఛన్లు రద్దు వేస్తూ వచ్చింది. నవంబర్ నాటికి ఏకంగా జిల్లా వ్యాప్తంగా 4,836 మందికి పింఛన్లు రద్దయ్యాయి. దీంతో అర్హులంతా లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది జూలై నెలలో జిల్లాలో 2,70,973 మందికి పింఛన్లు ఇవ్వగా..నవంబర్ నెల నాటికి ఆ సంఖ్య 2,66,137కు తగ్గింది. కూటమి నాయకుల కుట్రతోనే పింఛన్ రద్దుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యంగా సాగిన
పింఛన్ పంపిణీ
జిల్లా వ్యాప్తంగా
4,836 పింఛన్లు రద్దు
Comments
Please login to add a commentAdd a comment