No Headline
● కొద్ది రోజుల క్రితం మడకశిర నియోజకవర్గంలో నేరాల నియంత్రణపై పోలీసులు సమీక్ష సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. పోలీసులు తమ విధుల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలోనూ ప్రజాప్రతినిధి తలదూర్చడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికారం అడ్డం పెట్టుకుని ఇలా ప్రవర్తించడం సరికాదని నియోజకవర్గ పోలీసులు వాపోయారు.
● రాయదుర్గం నియోజకవర్గంలోని హనకనహాల్‌లో ఇటీవల దుండగులు రాములవారి రథాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో రఘునాథరెడ్డి అనే ఓ కానిస్టేబుల్‌ను అనవసరంగా టార్గెట్ చేస్తూ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. దీనిపై ఎస్పీ గానీ, డీఎస్పీ గానీ, పల్లెత్తు మాట మాట్లాడలేదు. బాధిత కానిస్టేబుల్‌కు కనీస భరోసా ఇచ్చిన పాపాన పోలేదు.
● కొన్ని రోజుల క్రితం తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంత రెడ్డిపై చిందులు తొక్కారు. తాను చెప్పినట్టు వినలేదంటూ రెచ్చిపోయారు. జనం ముందే సీఐతో క్షమాపణలు చెప్పించుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నివ్వెరపోయారు. అయితే, ఆ తర్వాత నోరు విప్పిన బాధిత సీఐ.. తాను తప్పు చేయకపోయినా, కొన్ని పరిస్థితుల కారణంగా సారీ చెప్పాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
● లాటరీలో మద్యంషాపు దక్కించుకున్న ఓ వ్యక్తి
అనంతపురం హౌసింగ్‌బోర్డులో ఇటీవల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ
రాజేంద్ర యాదవ్ సదరు వ్యక్తికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. అక్కడ ఎలా షాప్ పెడతావంటూ హెచ్చరించారు. దీంతో సదరు షాపు నిర్వాహకుడు హిందూపురం ఎంపీ పార్థసారథిని కలిసి సీఐకి
వార్నింగ్ ఇప్పించాక మార్గం సుగమమైంది.
Comments
Please login to add a commentAdd a comment