లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతి లెటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువు పొడిగించారు. ఈ మేరకు లేపాక్షిలోని విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత ప్రవేశ పరీక్ష 2025, ఫిబ్రవరి 8న ఉంటుంది.
ప్రమాదంలో వ్యక్తి మృతి
లేపాక్షి: మండలంలోని గొంగటిపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు... చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామానికి చెందిన ఈడిగ నారాయణప్ప (60) ద్విచక్రవాహనంపై బుధవారం హిందూపురానికి వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాడు. గొంగటిపల్లి వద్దకు చేరుకోగానే వాహనం చైన్ తెగిపోవడంతో అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే హిందూపురంలోని ఆస్పత్రికి తరలించి, వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.
ఆర్‌ఆర్‌బీ పరీక్షార్థుల కోసం ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ఈ నెల 23, 24వ తేదీల్లో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే అభ్యర్థుల రాకపోకలకు అనుకూలంగా అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించాయి. 23న నాంథేడ్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు(07105) మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి ఈ రైలు తిరుపతి జంక్షన్ నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నాంథేడ్ జంక్షన్‌కు చేరుతుంది. ఈ రైళ్లు ముద్కైడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment