అభాగ్యులకు అండగా నిలుస్తాం
ప్రశాంతి నిలయం: సమాజంలోని అభాగ్యులకు అండగా నిలుస్తూ, వారి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సత్యసాయి సేవా సంస్థలు పనిచేస్తున్నాయని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు తెలిపారు. సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నేపాల్‌లోని నువాకోట్ జిల్లా ఖనిగౌన్ పర్వత ప్రాంతాల్లోని వారికోసం నేపాల్ సత్యసాయి సేవా సంస్థలు 8 కమ్యూనిటీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌లు నిర్మించాయి. ఈ ప్రాజెక్ట్‌లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమీష్ పాండ్య ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2 వేల కుటుంబాలతో పాటు అక్కడి 11 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4 వేల మంది విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించనున్నట్లు వారు వెల్లడించారు. ఇదే తరహాలో రూపొందించనున్న మరో కొత్త వాటర్ ప్రాజెక్ట్‌ను ఆర్‌జే రత్నాకర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సంస్థలు ఆయా ప్రాంతాల్లోని అభాగ్యులకు అండగా నిలుస్తూ నిస్వార్థ సేవలందిస్తున్నాయని కొనియాడారు.
వైభవంగా స్నాతకోత్సవం..
బాబా జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ శ్రీసత్యసాయి ఎడ్యుకేషన్ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. శ్రీసత్యసాయి యూత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆర్‌జే రత్నాకర్ రాజు సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్–4 సభ్యులతో కలిసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఆకట్టుకున్న ‘కనెక్ట్ టూ కరెక్ట్’
సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌కు చెందిన యూత్ సభ్యులు ‘కనెక్ట్ టూ కరెక్ట్’ పేరుతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సత్యసాయి బోధనలను సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు చక్కగా వివరించారు. అనంతరం నిర్వహించిన ఫ్లూట్ కచేరీ పరవశభరితంగా సాగింది. పిల్లనగ్రోవిపై సత్యసాయిని కీర్తిస్తూ కళాకారులు చేసిన కచేరీ భక్తులను అమితంగా అలరించింది.
సత్యసాయి సేవా సంస్థల లక్ష్యమిదే
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు
Comments
Please login to add a commentAdd a comment