ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లి విక్రయాలు
ప్రశాంతి నిలయం: ప్రత్యేక కౌంటర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉల్లి విక్రయాలు చేపట్టాలని, ఇందుకోసం కర్నూలు మార్కెట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణ, నియంత్రణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా బియ్యం, కందిపప్పు, టమాట, ఉల్లి ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ, నిత్యవసర వస్తువులు ధరలు అకస్మాత్తుగా పెరగకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలన్నారు. ధరలు పెరిగినప్పుడు ప్రత్యేక కౌంటర్ల ద్వారా నిత్యావసరాలు అందించేందుకు హోల్‌సేల్ వ్యాపారులు, దిగుమతి దారులు, మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే జిల్లాలోని ప్రస్తుతం ఎన్ని వేరుశగన మిల్లులు పనిచేస్తున్నాయి...ఎన్ని మూత పడ్డాయి.. అందుకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ ఏడీని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, మార్కెటింగ్‌శాఖ అధికారి మూర్తి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, తూనికలు, కొలతల శాఖ అధికారులు, మిల్లుల యజమానులు, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
క్రీడల్లో ఏపీఆర్‌జేసీ
విద్యార్థుల సత్తా
● జాతీయ స్థాయి పోటీలకు
ఇద్దరు ఎంపిక
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. కళాశాలకు చెందిన పి.పునీత్‌కుమార్ (ఫస్ట్ ఇయర్) హ్యాండ్ బాల్ (అండర్–19), వి. గోపీచంద్ (సెకెండ్ ఇయర్) అథ్లెటిక్స్ (అండర్–19) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ జలజ తెలిపారు. బుధవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పాటు పీడీ శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జలజ మాట్లాడుతూ, ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొనగా. 30 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వారిలో పునీత్‌కుమార్, గోపీచంద్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. వీరిరువురూ త్వరలో పంజాబ్‌లోని లూథియానా, జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment