బాధ్యతలు చేపట్టిన బలరామిరెడ్డి
హిందూపురం: పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ బలరామిరెడ్డి తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం బలరామిరెడ్డిని మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్ శ్రీనివాసులు బుధవారం ఇన్‌చార్జ్ చైర్మన్ బాధ్యతలను బలరామిరెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా బలరామిరెడ్డి మాట్లాడుతూ, కౌన్సిలర్లు, అధికారులను సమన్వయం చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. తాను కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, ఏదైనా సమస్య ఉంటే ప్రజలు నేరుగా తనను కలవవచ్చన్నారు. సమస్య పరిష్కారానికి శాయశక్తులా కృషిచేస్తానని వెల్లడించారు.
అభినందనలు తెలిపిన
వైఎస్సార్‌సీపీ నాయకులు..
మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బలరామిరెడ్డిని ఆగ్రోస్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా నేత నవీన్‌నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు జయరాములు, రోషన్ అలీ, ఆయూబ్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రొటోకాల్ పాటించని కమిషనర్..
నిబంధనల మేరకు బలరామిరెడ్డిని చైర్మన్ ఛాంబర్‌లో కూర్చోబెట్టి పదవీ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ మున్సిపల్ కమిషనర్ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా ఉన్న బలరామిరెడ్డిని ఆయన ఛాంబర్‌లోనే కూర్చోబెట్టి ఇన్‌చార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ అధికార పార్టీకి మద్దతు పలుకుతూ పాలకవర్గాన్ని లెక్కచేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రభుత్వ ఆదేశాలనైనా పాటించాలంటున్నారు.
హిందూపురం మున్సిపల్
ఇన్‌చార్జ్ చైర్మన్‌గా విధులు
పట్టణాభివృద్ధికి అన్ని విధాలుగా
కృషిచేస్తానని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment