వీఆర్‌ఏ జిల్లా అధ్యక్షుడిగా గంగాధర్
పుట్టపర్తి అర్బన్ : వీఆర్‌ఏల జిల్లా అధక్ష్యుడిగా గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఏపీజేఏసీ అధ్యక్షుడు మధునాయక్, ప్రధాన కార్యదర్శి మైనుద్దీన్ తెలిపారు. శుక్రవారం పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏల నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఎన్నికలను ఏకగ్రీవం చేశారు. అధ్యక్షుడిగా ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా వినోద్‌కుమార్, సహ అధ్యక్షుడిగా కాంతరాజు, ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యం, ఆంజనేయులు, మారుతీప్రసాద్, కేశవప్రసాద్, నరసింహులు, ట్రెజరర్‌గా సుదర్శనరెడ్డి, జాయింట్ సెక్రెటరీగా అశ్వని, రెడ్డెప్ప, మణిపద్మ, రమణ, చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా మల్లికార్జునరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చిన్నాగప్ప, ఆంజనేయులు, ప్రభావతి, పోతులయ్య, బాబు, పాపయ్యను ఎంపిక చేశారు.
ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. విద్యార్థి దుర్మరణం
పెనుకొండ: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామానికి చెందిన వడ్డె నాగరాజు కుమారుడు అఖిల్ (13) పెనుకొండలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూల్‌కు సైకిల్‌పై బయలుదేరిన అఖిల్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్‌కు దారి వదిలేందుకు రోడ్డు పక్కన ఆపిన ఘనగిరి పాఠశాల బస్సు వెనుక నిలబడ్డాడు. ట్రాక్టర్ వెళ్లడానికి దారి లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఉన్నఫళంగా తన వాహనాన్ని వేగంగా రివర్స్ చేశాడు. సైకిల్‌పై నిల్చొన్న అఖిల్ ప్రమాదాన్ని గుర్తించేలోపు బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్న గ్రామస్తులు వెంటనే బాలుడిని పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అఖిల్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్‌ఐ వెంకటేశ్వరు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment