వ్యక్తి ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... సీకేపల్లి మండలం దామాజిపల్లి – యర్రంపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన కీమ్యాన్ సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతుడిని రామగిరి మండలం పోలేపల్లికి చెందిన చాకలి మురళి (32)గా గుర్తించారు. మృతునికి భార్య అంబిక, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బనానా రైలు ప్రారంభం
తాడిపత్రి రూరల్: అరటి ఎగుమతులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడ్స్ రైలును (బనానా రైలు) తాడిపత్రి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం కలెక్టర్ వినోద్‌కుమార్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు జెండా ఊపి రైలును ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా వ్యవసాయ, మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, హర్టీకల్చర్ అండ్ సెరికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏపీఈడీఏ జీఎం వినీత సుధాన్షు, కంటైనర్ కార్పొరేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ అనిత బారిక్, జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ, శ్రీకృష్ణ ఇంపెక్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనీష్‌అగర్వాల్, ఆర్డీఓ కేశవనాయుడు, హర్టీకల్చర్ డీడీ నరసింహారావు, ఎపీఎంఐపీ డీడీ రఘునాథరెడ్డి, ఏడీ ఫిరోజ్‌ఖాన్, రైల్వే స్టేషన్ మాస్టర్ అనిల్‌కుమార్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ అనూప్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment