సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి
పుట్టపర్తి అర్బన్: సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని దిశ చైర్మన్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొదటి సారి జిల్లా అభివృధ్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ చేతన్, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, కమిటీ సభ్యులు ఏవీ రమణారెడ్డి, చక్రవర్ధన్‌రెడ్డి, శివశంకర్, మీనాక్షి, నరసింహులు, సువర్ణ, భారతి, నరసింహమూర్తి, రామాంజనేయులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దిశ చైర్మన్ మాట్లాడుతూ కరువు నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ నష్టపోయిన కంది పంటకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా అని అధికారులను అడిగారు. హిందూపురంలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు కవిత, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్, డీపీఓ సమత, పీఆర్ ఎస్‌ఈ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లికార్జున, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment