ప్రేమ, శాంతి వెల్లివిరియాలి
పుట్టపర్తి అర్బన్: ప్రజల్లో ప్రేమ, శాంతి వెల్లి విరియాలని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ శనివారం క్రిస్మస్ క్యాండిల్‌ను వెలిగించి వేడుకలు ప్రారంభించారు. ఐదు రోజులపాటు సాగే వేడుకలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి క్రీస్తు బోధనలు, సత్యసాయి బోధనల సారాన్ని భక్తులకు వివరించారు. ప్రేమ, శాంతి కోసం క్రీస్తు, సత్యసాయి ఏ విధంగా బోధనలు చేశారో ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రసారం చేశారు. ప్రముఖ సంగీత కళాకారిణి అనులవ్ సంగీత కచేరీ, సాయంత్రం భజనలు, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు.
శోభయమానం..
క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భవనాలు, ప్రహరీలతో పాటు పార్కులు, క్యాంటీన్లు, స్టోర్, రేడియో సాయి, పరిపాలనా భవంతి తదితర చోట్ల క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాజ్, ఏసు జన్మించిన బోధ కొట్టం, తదితర ఆకృతులతో విద్యుత్ దీపాలను అలంకరించారు.
ప్రశాంతినిలయంలో
క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment