● అ‘పూర్వ’ సమ్మేళనం
హిందూపురం టౌన్: స్థానిక మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ (ఎంజీఎం)లో 1979–80 విద్యా సంవత్సరంలో చదువుకున్న వారందరూ అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. అప్పటి ఉపాధ్యాయులు అక్బర్ షరీఫ్, నారాయణ శెట్టిను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు వేణుగోపాల్, నారాయణమూర్తి, తిమ్మయ్య, మల్లికార్జున, వై.సి.ప్రభాకర్, ఎస్‌ఎల్‌వీ వేణు తదితరులు నేతృత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment