కరెంటు చార్జీలు తగ్గించండి
గోరంట్ల: కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం పోరుబాటకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఒక్కరోజు ముందుగానే గురువారం రాత్రి గోరంట్లలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో లాంతర్ల ప్రదర్శన నిర్వహించారు. వాసవీ మహల్ ఫంక్షన్ హాలు నుంచి వైఎస్సార్‌సీపీ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారని చంద్రబాబుపై మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు చెల్లించలేక పేదలు చీకటిలో మగ్గాల్సి వస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదరులపై మోపిన రూ.15,485.36 కోట్ల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వీరనారాయణరెడ్డి, పట్టణ కన్వీనర్ మేదర శంకర, జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పొగాకు రామచంద్ర, మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలసముద్రం ఫక్రుద్దీన్ సాహెబ్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, జిల్లా స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, బూదిలి సహకార సంఘం అధ్యక్షుడు రఘురామిరెడ్డి, ముఖ్యనాయకులు బాలన్నగారిపల్లి కృష్ణారెడ్డి, బూదిలి శ్రీనివాసరెడ్డి, వానవోలు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment