స్వచ్ఛందంగా తరలిరండి
కరెంటు చార్జీలు పెంచేది లేదంటూ కూటమి నేతలు ఎన్నికల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యుత్ చార్జీలను భారీగా పెంచారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘పోరుబాట’ చేపడుతున్నాం. పుట్టపర్తి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, కదిరిలో నిర్వహించే ర్యాలీ, అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించనున్నాం. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలి.
– ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment