మేమొస్తున్నాం.. సర్దుకోండి!
చిలమత్తూరు: మండలంలోని పలు గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా దర్జాగా మద్యం విక్రయాలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. అదనపు ధరతో మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ‘పల్లెల్లో బెల్టు కిక్కు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురించింది. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెతాయి. అయితే అధికారులు మాత్రం తప్పదన్నట్టు గురువారం తనిఖీలకు ఉపక్రమించారు. తామొస్తున్నట్లు ముందుగానే సదరు బెల్టుషాపుల నిర్వాహకులకు సమాచారం అందజేసినట్లు తెలిసింది. ‘సరుకు కనిపించకుండా సర్దుకోండి ’ అంటూ జాగ్రత్తలు చెప్పినట్లు సమాచారం. తాపీగా సాయంత్రం వెళ్లే సరికి అక్కడ మద్యం ఆనవాళ్లు లేకుండా చేశారు. ఎక్సైజ్ అధికారుల అండదండలతో బెల్టుషాపుల నిర్వాహకుల వ్యాపారం మూడు పువ్వులు– ఆరు కాయలుగా వర్ధిల్లుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లేపాక్షి మండలంలోనూ..
లేపాక్షి మండలం కోడిపల్లి రోడ్డులో అనధికార బెల్టు షాపు ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్‌ను తలపిస్తోంది. విద్యుత్ వెలుగు జిలుగుల నడుమ మద్యం విక్రయిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం గురించి కూడా ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. అయితే అధికారులు వెంటనే సదరు బెల్టుషాపు నిర్వాహకులకు ముందస్తు సమాచారం అందించి తనిఖీలకు వచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు.
సాయంత్రం తీరిగ్గా వచ్చి తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment