చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ధర్మవరం అర్బన్: చోరీ కేసులో ఓ యువకుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు, ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రామగిరి మండలం నసనకోట గ్రామానికి చెందిన సాకే నారాయణ ధర్మవరంలోని ఎల్–3 కాలనీలో నివాసముంటున్నాడు. కొన్ని నెలల క్రితం కళాజ్యోతి, అంజుమన్ సర్కిళ్లలో మహిళలను మాయమాటలతో ఏమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలను అపహరించాడు. అలాగే లక్ష్మీచెన్నకేశవపురంలో రాత్రి సమయంలో ఇంటి తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. ఆయా ఘటనల్లో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తలో భాగంగా శుక్రవారం యర్రగుంట సర్కిల్‌లో తచ్చాడుతున్న సాకే నారాయణను గుర్తించి అరెస్ట్ చేశారు. మూడు జతల బంగారు కమ్మలు, 2.50 తులాల బంగారు చైన్, 1.50 తులాల బంగారు చైన్, ఓ ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ గోపీకుమార్, హెడ్ కానిస్టేబుల్ శివకుమార్, కానిస్టేబుళ్లు శివశంకర్, భాస్కర్‌ను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment