పెనకొండ రూరల్: కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించడం సరికాదని సీఐ రాఘవన్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హితవు పలికారు. శుక్రవారం పెనుకొండలోని సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆమె నేరుగా సీఐతో సంప్రదించారు. సోమందేపల్లి మండలం నాగినాయణచెరువు పంచాయతీ బుసయ్యగారిపల్లికి చెందిన శ్రీరామప్ప, శకుంతలమ్మ, నరిసింహప్ప, గోవిందరెడ్డిను పోలీసుల వేధింపులు, పెనుకొండలో ఇటీవల చోటు చేసుకున్న ఓ వివాదానికి సంబంధించి బాబా, నయాజ్, షెక్షా, బేల్దారి షెక్షాపై అక్రమంగా కేసుల నమోదు చేసిన అంశాలపై చర్చించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై సీఐ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె వెంట వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, సోమందేపల్లి మండల కన్వీనర్ గజేంద్ర, నాగినాయనచెరువు సర్పంచ్ అంజినాయక్, పెనుకొండ నగర పంచాయతీ కౌన్సిలర్ సద్దాం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment