రైలు పట్టాలపై మొరాయించిన లారీ
సోమందేపల్లి: మండలంలోని చాకర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై ఓ లారీ మొరాయించింది..శుక్రవారం ఉదయం హిందూపురం వైపు నుంచి అనంతపురం వెళుతున్న లారీ రైల్వే గేట్ వద్దకు చేరుకోగానే పట్టాలు దాటుతుండగా మధ్యలోనే నిలిచిపోయింది. డ్రైవర్ విశ్వ ప్రయత్నాలు చేసినా ముందుకు కదల్లేదు. దీంతో గేట్‌మెన్ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలును రంగేపల్లి రైల్వేస్టేషన్ ఆపారు. అలాగే కొయంబత్తూరు నుంచి రాజ్‌కోట్‌కు వెళుతున్న రైలును మలుగూరు రైల్వేస్టేషన్‌లో ఆపేశారు. అరగంట పాటు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చివరకు జేసీబీని తీసుకువచ్చి లారీని అక్కడి నుంచి తొలగించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment