తగ్గిన ఎండు మిర్చి ధరలు
హిందూపురం అర్బన్: తుపాను ప్రభావం ఎండుమిర్చి ధరలపై తీవ్రంగా చూపుతోంది. వరుస తుపాన్లతో మిర్చిలో తేమశాతం పెరిగింది. దీంతో ఎండుమిర్చి ధరలు పడిపోయాయి. శుక్రవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 103 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. వేలంలో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా రూ.15,500, రెండో రకం క్వింటా రూ.8 వేలు, మూడో రకం ఎండుమిర్చి క్వింటా రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు.
21 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ జిల్లాలోని 21 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 24.6 మి.మీ, కదిరి మండలంలో 21 మి.మీ వర్షపాతం నమోదైంది. తనకల్లులో 14.4 మి.మీ, ఓడీ చెరువు 14.2, గాండ్లపెంట 9.8, అమడగూరు 9.2, ఎన్‌పీ కుంట 7.2, కొత్తచెరువు 7.2, నల్లమాడ 6.8, పుట్టపర్తి 6.4, బుక్కపట్నం 5.6, తలుపుల 5.4, ముదిగుబ్బ 4.2, పెనుకొండ 3.8, ధర్మవరం 3.6, బత్తలపల్లి 2.8, సీకే పల్లి, సోమందేపల్లి మండలాల్లో 2.6 మి.మీ, గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో 2.2 మి.మీ, తాడిమర్రి మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల
నియంత్రణకు చర్యలు
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్‌న్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెనన్స్ హాలులో జిల్లా స్థాయి రోడ్‌సేఫ్టీ కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాద తీవ్రత, మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదు చేసి శిక్షపడేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. తరచూ ప్రమాదాలు తరచుగా జరిగే ప్రదేశాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల వెనుకభాగంలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లలో ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేలా ప్లెక్సీలు ప్రదర్శించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, రవాణా శాఖ అధికారి కరుణ సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment