గోరంట్ల: మండలంలోని కుబేర హిల్స్‌లో గత ఏడాది ఆగస్టు లో కారు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఘటనపై అప్పట్లో కుబేర హిల్స్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడు, రామన్నపల్లికి చెందిన వినోద్‌కుమార్‌ను సోమవారం బూదిలి క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
కనగానపల్లి: మండలంలోని ముక్తాపురం సమీపంలో 44వ జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న సుమారు 35 క్వింటాళ్ల రేషన్ బియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం నుంచి బెంగుళూరు వైపు వాహనంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో డ్రైవర్ షాకీర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment